Chandrababu : వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష

సచివాలయంలో వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు

Update: 2025-10-09 07:35 GMT

సచివాలయంలో వ్యవసాయశాఖ, అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి కె.అచ్చెన్నాయుడు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఖరీఫ్ సాగు, రబీ ప్రణాళిక, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షలో చర్చ జరిగింది.

రబీ సీజన్ లో...
రబీ సీజన్ లో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో గ్రాస్ వాల్యూ అడిషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 11 తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్న పీఎం ధన్ ధాన్య కృషి యోజనపైనా సమీక్షలో చర్చ జరిగింది.


Tags:    

Similar News