Chandrababu : గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు.. ఇక వారి ఖాతాల్లో డబ్బులే డబ్బులు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు

Update: 2025-04-30 12:06 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మే నెల నుంచి రెండు ప్రతిష్టాత్మకమైన హామీలను అమలు చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. వచ్చే నెలలో అన్నదాత సుఖీభవ పథకంతో పాటు తల్లికి వందనం పథకాలను ప్రారంభిస్తామని తెలిపారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బూత్ స్థాయి నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ ప్రకటన చేశారు.

రెండు పథకాలను...
మే నెలలోనే ఇచ్చిన రెండు హామీలను అమలు చేయనున్నామని, రైతుల ఖాతాల్లో తొలి విడతగా అన్నదాత సుఖీభవ పథకం కింద నగదును జమ చేస్తున్నామని తెలిపారు. అలాగే తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నవిద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి ఈ ఏడాది ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పారు. మే 2వ తేదీన జరిగే అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి అందరూ తరలి రావాలని టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు కోరారు.


Tags:    

Similar News