Andhra Pradesh : ముగిసిన ముగ్గురి భేటీ.. పవన్ తో అనిత సమావేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశం ముగిసింది
pawan kalyan, vangalapudi anita
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశం ముగిసింది. వివిధ కేసులకు సంబంధించి అనిత పవన్ కల్యాణ్ కు ఈ సమావేశంలో వివరించారు. ఈ కేసుల నమోదు చేయకపోవడానికి గల కారణాలు కూడా ఆమె తెలిపారు. కొన్ని కేసులను పరిశీలిస్తున్నట్లు ఆమె పవన్ కల్యాణ్ కు వివరించినట్లు తెలిసింది. కులం, మతం చూసి కేసులు నమోదు చేయకపోవడం అంటూ ఏమీలేదని అనిత వివరించినట్లు సమాచారం.
శాంతిభద్రతల పరిస్థితులపై...
కేసు వివరాలను, ఫిర్యాదు దారుల నుంచి వచ్చిన అర్జీలను లోతుగా పరిశీలించిన తర్వాత మాత్రమే న్యాయపరమైన చిక్కులు ఎదురు కాకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారని అనిత పవన్ కల్యాణ్ కు ఈ సమావేశంలో వివరించినట్లు తెలిసింది. ఇటీవల పవన్ కల్యాణ్ పదే పదే హోంశాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేేపథ్యంలో ఈ ముగ్గురు నేతలు సమావేశమై చర్చించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థిితులు, శాంతిభద్రతల కోసం తీసుకున్న చర్యలను అనిత పవన్ కల్యాణ కు విరవించినట్లు తెలిసింది.