నేడు నాగబాబు చెక్కుల పంపిణీ
మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు నేడు చెక్కుల పంపిణీ జరగనుంది
మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు నేడు చెక్కుల పంపిణీ జరగనుంది. ప్రమాదవశాత్తూ మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరుపున చెక్కులను అందించనున్నారు. పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు మరణించిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులను అందచేయనున్నారు. జనసేన కార్యకర్తలు గత కొంత కాలం నుంచి 101 మంది మరణించారు.
ప్రమాద వశాత్తూ మరణించిన...
101 మంది కార్యకర్తల కుటుంబాలకు నేడు నాగబాబు చెక్కుల పంపిణీ చేయనున్నారు. జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం బీమా సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ బీమా చెక్కులను నేడు నాగబాబు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు అందచేయనున్నారు. ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షలు చెల్లించనున్నారు. మంగళగిరిలోని ఆర్ఆర్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో మొత్తం 5.05 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేస్తారు.