Chandrababu : నేడు నారావారిపల్లెలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నారావారిపల్లెలో పర్యటించనున్నారు

Update: 2026-01-15 04:01 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నారావారిపల్లెలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు గ్రామదేవత, కుల దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఉండవల్లికి తిరుగు పయనమవుతారు.

17వ తేదీన కాకినాడకు...
మరొకవైపు ఈ నెల 17వ తేదీన కాకినాడకు సీఎం చంద్రబాబు బయలుదేరి వెళతారు. అమ్మోనియా ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమాలకు భారీగా ప్రజలు తరలి వస్తారని ఊహించి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Tags:    

Similar News