Chandrababu : రైతులతో చంద్రబాబు ముఖాముఖి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

Update: 2025-12-03 07:33 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలోని రైతులతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రైతులు ఏ ఏ పంటలు వేస్తున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. ముందుగా అక్కద వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తారు.

రైతుల సమస్యలను తెలుసుకుంటూ...
అనంతరం ప్రజావేదికలో రైతులు, వారి కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడుతున్నారు. వారి కష్టాలను, నష్టాలను గురించి అడిగి తెలుసుకుంటున్నారు. రైతులు కూడా తమకు నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. కొందరు విద్యుత్తు సరఫరాను తమకు అందించాలని చంద్రబాబు నాయుడును కోరుతున్నారు. అందరికీ చంద్రబాబు నాయుడు హామీ ఇస్తున్నారు.


Tags:    

Similar News