Chandrababu : నేడు తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

Update: 2025-12-03 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రైతన్నా మీకోసం ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్లలోని రైతుతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం పదిన్నర గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి హెలికాప్టర్ లో నల్లజర్లకు చేరుకుంటారు.

రైతులతో ముఖాముఖి...
అక్కద వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలిస్తారు. అనంతరం ప్రజావేదికలో రైతులు, వారి కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడతారు. వారి కష్టాలను, నష్టాలను గురించి అడిగి తెలుసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు.తర్వాత సాయంత్రం ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళతారు. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.


Tags:    

Similar News