Chandrababu : కృష్ణా జలాలపై కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు

Update: 2026-01-04 13:03 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలపై తాను త్వరలోనే మాట్లాడతానని తెలిపారు. కృష్ణా జలాల విషయంలో అసలు ఏం జరిగిందన్న దానిపై త్వరలోనే మీడియా ద్వారా తాను వివరించే ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

రేవంత్ వ్యాఖ్యలతో...
నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబును ఒప్పించి పనులను నిలిపి వేయించింది తానేననని చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. రాయలసీమ ప్రజలకు ద్రోహం చేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు పై ఆరోపించారు. దీంతో చంద్రబాబు తాను త్వరలోనే కృష్ణా జలాలపై మాట్లాడతానంటూ తెలిపారు.


Tags:    

Similar News