అధికారులపై జీవీరెడ్డి సీరియస్
ఫైబర్ నెట్ ఎండీతో పాటు అధికారులపై ఛైర్మన్ జీవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ఫైబర్ నెట్ ఎండీతో పాటు అధికారులపై ఛైర్మన్ జీవీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల్లో లెక్కలేని నిర్లక్ష్యంతో పాటు ఒళ్లు బద్ధకం కనిపిస్తుందన్నారు. ఫలితంగా న్యాయస్థానాల్లో సక్రమంగా పిటీషన్ వేయకపోవడంతో 337 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసేలా చేశారని అన్నారు. అధికారులు ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తన్నారని ప్రశ్నించారు.
ప్రయివేటు సంస్థలతో...
ప్రయివేటు సంస్థలతో అధికారులు కుమ్మక్కయినట్లు తనకు తనకు అనుమానంగా ఉందని అన్నారు. బిజినెస్ చేయకపోగా ఉన్నదాన్ని పోగొడుతున్నారన్న జీవీ రెడ్డి ప్రభుత్వంతో ఫైబర్ నెట్ అధికారులపై సీఐడీ విచారణ కోరతానని తెలిపారు. తనకు కనీసం ఫైళ్లు కూడా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. తాను ఇష్టముంటే ఛైర్మన్ గా ఉంటానని లేకపోతే వెళ్లిపోతానని జీవీ రెడ్డి అన్నారు.