Breaking : బనకచర్లపై ఏపీ సర్కార్ కు కేంద్ర జలసంఘం లేఖ

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర జలసంఘం కోరింది

Update: 2025-07-04 05:52 GMT

పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర జలసంఘం కోరింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. గోదావరి నదిలో వరద జలాల డేటాను ఇవ్వాలని కేంద్ర జలసంఘం కోరింది. సముద్రంలోకి ఏటా ఎన్ని క్యూసెక్కులు నీరు వృధాగా పోతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వినియోగించుకుంటున్నది వివరాలతో పాటు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత నీటి ప్రాజెక్టు వివరాలను అందించాలని కేంద్ర జలసంఘం ఏపీ ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరింది.

ప్రతిపాదిత ప్రాజెక్టులు...
రాష్ట్రంలో ప్రతిపాదిత ప్రాజెక్టుల వివరాలు, వాటి నివేదిక ఇవ్వాలని కోరింది. దీంతో వచ్చే వారం నీటిపారుదల శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్లి స్వయంగా కేంద్ర జలసంఘానికి నివేదికలను అందించనున్నారని తెలిసింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్రం నిరాకరించడంతో పాటు కేంద్ర జలసంఘం అనుమతులను ముందుగా తీసుకోవాలని సూచించింది. అందుకే ఈ మేరకు కేంద్ర జలసంఘం గోదావరి నీటికి సంబంధించిన వివరాలను కోరుతూ లేఖ రాసినట్లు తెలిసింది.


Tags:    

Similar News