Janasena : జనసేన కు ఈసీ గుడ్ న్యూస్

కేంద్ర ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీ గుర్తుకు గుర్తింపు వచ్చింది

Update: 2025-01-22 02:17 GMT

కేంద్ర ఎన్నికల కమిషన్ జనసేన పార్టీకి గుడ్ న్యూస్ చెప్పింది. జనసేన పార్టీ గుర్తుకు గుర్తింపు వచ్చింది. సుదీర్ఘకాలంగా గుర్తింపు కోసం ఎదురు చూస్తుున్నారు. ప్రతి ఎన్నికకు అదొక టెన్షన్ లా మారిపోయింది. గాజు గ్లాసు గుర్తు జనసేన అభ్యర్థులు లేని చోట ఆ గుర్తు కేటాయించడం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అయితే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వు చేసింది.

గుర్తింపు ఇస్తూ...
జనసేన పార్టీని ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు పొందిన పార్టీగా కేంద్ర ఎన్నికల కమిషన్ జాబితాలో చేర్చింది. దీనివల్ల ఇక రానున్న ఎన్నికల్లో గుర్తుపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలుండవు. జనసేనను గుర్తింపు పొందిన పార్టీగా ప్రకటించింది. గాజు గ్లాసు గుర్తును రిజర్వు చేయడంతో ఇక ఎన్నికల సమయంలో నేతలకు ఆ టెన్షన్ తప్పినట్లయింది. ఈ మేరకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ లేఖ పంపింది.


Tags:    

Similar News