Pulivendula : నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం
కడప జిల్లాలో జరగనున్న రెండు జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం నేటితో ముగియనుంది.
కడప జిల్లాలో జరగనున్న రెండు జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం ఐదు గంటలకు అన్ని పార్టీలు ప్రచారానికి స్వస్తి చెప్పనున్నాయి. ప్రధానంగా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలను అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అనేక ప్రాంతాల్లో ఘర్షణలు కూడా జరుగుతున్నాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో...
ఎన్నిక ఈ నెల 12వ తేదీన జరగనుంది. పులివెందుల నియోజకవర్గం వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఈ ఎన్నిక మరింత హీటెక్కింది. అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుంచి ప్రచారం ముగిసేంత వరకూ టెన్షన్ మధ్య కొనసాగింది. నేటితో ప్రచారానికి తెరపడటనుండటంతో ఇక ఇంటింటి ప్రచారంపైనే నేతలు దృష్టి పెట్టనున్నారు.