బైరెడ్డి శబరికి అరుదైన గౌరవం
బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన బైరెడ్డి శబరికి అరుదైన అవకాశం లభించింది.
బ్రెజిల్ లో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన బైరెడ్డి శబరికి అరుదైన అవకాశం లభించింది. చాలా తక్కువ మందికి దక్కే గౌరవం బైరెడ్డి శబరికి దక్కింది. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలి సారిగా ఎన్నికయిన బైరెడ్డి శబరికి బ్రిక్స్ సమ్మిట్ లో మాట్లాడే అవకాశం లభించడం నిజంగా గొప్ప విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు.
బ్రిక్స్ దేశాల సమావేశానికి ...
బ్రిక్స్ దేశాల సమావేశానికి సభ్యదేశాలనుంచి ముగ్గురు, నలుగురు మహిళలు హాజరయ్యారు . కానీ బ్రెజిల్ సమావేశానికి భారత్ నుంచి ప్రాతినిథ్యం వహించిన ఏకైక మహిళ నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. 2025 బ్రిక్స్ అన్ని సమావేశాల్లోనూ వివిధ అంశాలపై ఆమె ఒక్కరే ప్రసంగించనున్నారు. దీంతో నంద్యాల ప్రజలు మాత్రమే కాకుండా ఏపీ ప్రజలకు కూడా ఇది గర్వకారణమే.