తమ్మినేనితో బొత్స భేటీ అందుకేగా?
తమ్మినేని సీతారాంతో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.
తమ్మినేని సీతారాంతో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. తమ్మినేని సీతారాం పార్టీని వీడుతున్నారన్న ప్రచారం జరుగుతుండటంతో ఆయనను కలిశారన్న ప్రచారం జరుగుతుంది. ఆయన జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, తనను ఆముదాలవలస ఇన్ ఛార్జి నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంటు ఇన్ ఛార్జిగా నియమించడంతో ఆయన అసంతృప్తితో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు వచ్చాయి.
పరామర్శకే వచ్చానని...
తన కుటుంబ సభ్యులతో కలసి ఆయన జనసేనలోకి చేరేందుకు సిద్ధమయ్యారన్న సమాచారంతో బొత్స సత్యనారాయణ భేటీ జరిగిందని చెబుతున్నారు. అయితే తమ్మినేని కుమారుడు నానికి సర్జిరీ జరిగిందని పరామర్శకు వచ్చానని బొత్స సత్యనారాయణ తెలిపారు. మంత్రి కొండపల్లి విషయంతో తనకు సంబంధం లేదని, ఎవరు క్రియేట్ చేసారో వారే సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ అన్నారు.