Bojjala Sudheer : బొజ్జల సుధీర్ రెడ్డి షాకింగ్ వీడియో రిలీజ్

కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియోపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు

Update: 2025-10-13 13:04 GMT

కోట వినుత డ్రైవర్ రాయుడు వీడియోపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. రాయుడు వీడియో ఏఐతో రూపొందించారా? వాస్తవమా? అన్నది తేల్చాలన్నారు. రాయుడు హత్య జరిగిన రెండు నెలల తర్వాత వీడియో విడుదల చేశారని, తనపై బురదజల్లడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నుంచి కోట వినుత దంపతులు తన గెలుపునకు సహకరించలేదని, ఇంటికి వెళ్లి ఓట్లు అడిగినా సరైన రీతిలో స్పందించలేదని తెలిపారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయిందన్నారు.

దశాబ్దాల నుంచి...
తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో కలసి కొన్ని దశాబ్దాల నుంచి రాజకీయాలు చూస్తున్నానని, ఎప్పుడూ ఇలాంటి రాజకీయాలు తాను చూడలేదని ఆయన చెప్పారు. ఈ మేరకు బొజ్జల సుధీర్ రెడ్డి ఒక వీడియో విడుదల చేశారు. కోట వినుత డ్రైవర్ రాయుడి వీడియో పై స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. బెయిల్ పై వచ్చినంత మాత్రాన నిర్దోషులు కాదని, న్యాయస్థానం హత్యలో ప్రమేయం లేదని తేల్చి చెప్పాలని బొజ్జల సుధీర్ రెడ్డి వీడియోలో పేర్కొన్నారు.


Tags:    

Similar News