ఏపీలో బీజేపీ కార్నర్ మీటింగ్స్

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కార్నర్ మీటింగ్ లు జరపనుంది

Update: 2022-09-02 12:11 GMT

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ కార్నర్ మీటింగ్ లు జరపనుంది. దాదాపు ఐదు వేల మీటింగ్ లు జరపాలని నిర్ణయించింది. ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. రాష్ట్రానికి ఈ ఎనిమిదేళ్లలో ఎయిమ్స్, విద్యాసంస్థలతో పాటుగా జాతీయ రహదారుల నిర్మాణం, పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులను ప్రజలకు వివరించేందుకే ఈ కార్నర్ మీటింగ్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

సభల ఏర్పాటుకు కమిటీ....
కుటుంబ, వారసత్వ రాజకీయ పార్టీలను వ్యతిరేకించాలని ఈ సభల ద్వారా ప్రజలకు పిలుపునివ్వనున్నామని తెలిపారు. రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం కారణంగా పెద్దయెత్తున జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తామని చెప్పారు. భవిష్యత్ లో బీజేపీ క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని చేపట్టనున్నామని చెప్పారు. ఈ సభల ఏర్పాటు, విజయవంతం కావడం కోసం సోము వీర్రాజు ప్రత్యేకంగా కమిటీని నియమించారు. దీనికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారు. ఇక ఉత్తరాంధ్రకు పరశురాం రాజు, కోస్తాంధ్రకు కోలా ఆనంద్, గోదావరి జిల్లాలకు తపన చౌదరి, రాయలసీమకు పనతల రమేష్ ను నియమించారు


Tags:    

Similar News