బలోపేతమయ్యేదెలా?

వైసీపీ ప్రభుత్వం పై చార్ట్ షీట్ వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు

Update: 2023-03-21 07:47 GMT

వైసీపీ ప్రభుత్వం పై చార్ట్ షీట్ వేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మచిలీపట్నంలో చేసిన వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. జనసేన, బీజేపీ కలసి నాలుగేళ్ల క్రితమే పనిచేసి ఉంటే ఇప్పటికే బలోపేతమయ్యేవని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర నేతలు చలో అమరావతి కార్యక్రమాన్ని అడ్డుకున్నారన్న పవన్ వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈరోజు విజయవాడలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కోర్ కమిటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారని తెలుస్తుంది. ప్రజాపోరు ద్వారా ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడదామని బీజేపీ నేతలు నిర్ణయించారు. పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావించారు. కేంద్ర పార్టీ ఇచ్చిన సూచనలను అందరూ పాటించాలని, వైసీపీ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు పై ఒక ఛార్జిషీటు తయారు‌ చేయాలని నిర్ణయించారు.

పవన్ వ్యాఖ్యలపై....
ఏపీ అభివృద్ధి ప్రధానమైన అంశంగా మనం‌ భావిస్తున్నామని, మోడీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి అనేక విధాలుగా సాయం అందించామని, వేల కోట్లు నిధులు ఇచ్చి అభివృద్ధి కి సహకరించామని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. రాజకీయాలు ప్రధానం‌ కాదని, అభివృద్ధే ముఖ్యమని, రూ. 8లక్షల 16వేల కోట్లతో సబ్ కా సాత్ సబ్ కా‌వికాస్ పేరుతో అభివృద్ధి ని ప్రోత్సహించామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్ జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి , బూత్ స్వశక్తి కరణ్ అభియాన్ ఇంఛార్జి అరవింద్ మీనన్, జాతీయ కార్యదర్శి, ఎపి సహా సునీల్ దేవదర్, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, రాష్ట్ర పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ఇంచార్జ్ లు పాల్గొన్నారు.


Tags:    

Similar News