నష్ట పరిహారం ఇవ్వండి : బీజేపీ డిమాండ్

మాండూస్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు

Update: 2022-12-12 06:36 GMT

మాండూస్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగిందని ఆయన తెిపారు. వెంటనే పంట నష్టపరిహారాన్ని ముఖ్యమంత్రి ప్రకటించాలని ఆయన కోరారు. తక్షణ సాయం కింద వరదబాధితులకు ఒక్కో కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు.

అంచనా వేయడానికి కమిటీ...
పంట నష్టాన్ని అంచనా వేయడానికి జిల్లాల మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రులు, వ్యవసాయ అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని విష్ణువర్థన్ రెడ్డి కోరారు. కమిటీలు వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, నష్టాన్ని అంచనా వేయాలని ఆయన కోరారు. వర్షాలకు ధాన్యం తడిసి రైతులకు నష్టం జరిగిందన్నారు. కంది, మిరప, టమాటా వంటి వాణిజ్య పంటలు ఎందుకూ పనికి రాకుండా పోయాయని, వెంటనే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


Tags:    

Similar News