BJP : నేడు నంద్యాల జిల్లాలో మాధవ్ పర్యటన
నేడు నంద్యాల లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ పి. వి. ఎన్ మాధవ్ పర్యటించనున్నారు
నేడు నంద్యాల లో బీజేపీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ పి. వి. ఎన్ మాధవ్ పర్యటించనున్నారు. సారధ్యం సభ లో మాధవ్ ప్రసంగించనున్నారు. నిన్న కడప జిల్లాలో పర్యటించిన మాధవ్ నేడు నంద్యాల జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. బీజేపీని క్షేత్ర స్థాయి లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా మాధవ్ పర్యటన రాయలసీమలో కొనసాగుతుంది.
పార్టీ బలోపేతంపై...
నంద్యాల జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి నేతలు, ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి రావాలని ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లనున్నాయి. ప్రతి గ్రామం లో బీజేపీ జెండా ఎగిరేలా కార్యాచరణ కు రంగం సిద్ధం చేయాలని మాధవ్ సూచించనున్నారు. ప్రజా సమస్యల పై నిరంతరం కార్యకర్తలు దృష్టి పెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.