Bird Flu : చికెన్ తినాలంటే భయపడుతున్నారా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే?

ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ వ్యాధి పెరిగింది. లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. చికెన్ దుకాణాలన్నీదాదాపు క్లోజ్ అయ్యాయి

Update: 2025-02-21 04:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ వ్యాధి పెరిగింది. లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. చికెన్ దుకాణాలన్నీదాదాపు క్లోజ్ అయ్యాయి. అదే సమయంలో కోళ్ల ఫారాలు దాదాపు మూతబడిపోయాయి. తొలుత తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకే పరిమితమయిన బర్డ్ ఫ్లూ వ్యాధి తర్వాత క్రమంగా ఇతర జిల్లాలకు సోకింది. దీంతో ఈ వ్యాధిలేని జిల్లాల్లోనూ చికెన్ తినడం దాదాపు మానేశారు. ఎక్కడ బర్డ్ ఫ్లూ సోకిన చికెన్ ను విక్రయిస్తున్నారో తెలియక దానికి దూరంగా ఉండాలని మాంసంప్రయులు నిర్ణయించుకున్నారు. దీంతో భయపోగొట్టటానికి ఏపీలో చికెన్ మేళాలు నిర్వహిస్తుంది. ఫ్రీగా చికెన్ తో తయారైన వస్తువులను అందచేస్తుంది. ఏపీ వ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ఈ చికెన్ మేళాలను నిర్వహించి అవగాహన కల్పించనున్నార.

సరిహద్దురాష్ట్రాల్లో...
ఏపీ సరిహద్దు రాష్ట్రాల్లో కూడా నిఘాను ఏర్పాటు చేశాయి. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల లోడ్ తో ఉన్న వాహనాలను ఏపీ నుంచి తమ రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. అటు నుంచి అటే వెనక్కు పంపుతున్నారు. అయితే బ్రాయిలర్ కోళ్లకు మాత్రమే ఈ బర్డ్ ఫ్లో వ్యాధి సోకినా నాటు కోళ్లను కూడా కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. వాటిని తింటే ఎలాంటి ఇన్ ఫెక్షన్ సోకదని వ్యాపారులు చెబుతున్నప్పటికీ నాటుకోళ్ల వ్యాపారం కూడా పూర్తిగా నేల చూపులు చూస్తుంది.
హానిజరగదని...
మరొక వైపు కిలో కోడిమాంసం ఖరీదు 160 రూపాయలకు ఇస్తున్నాకొనేవారు లేరు. కోడి మాంసం సరే.. కోడిగుడ్లను కూడా కొనడం మానేశారు. గుడ్డుధర ఐదు రూపాయలకు పడిపోయింది. మన భారతీయ వంట విధానంలో బర్డ్ ఫ్లూ సోకిన కోడి మాంసం తినినా ఎలాంటి హాని జరగదని పశువైద్యాధికారులు చెబుతున్నారు. నిజం నాలుగు నెలల పాటు ప్రయాణిస్తే అబద్ధం అరగంటలో చేరుతుందన్నట్లుగా దానినే నమ్మి ప్రజలు భయపడిపోతున్నారు. దీంతో కోడి మాసం విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. కోడి మాసంతో తయారై సాయంత్రం వేళ స్నాక్ గా విక్రయించే చికెన్ పకోడి బళ్లు కూడా కనిపించకుండా పోయాయి. వ్యాపారాలు లేక చిరు వ్యాపారులు ఇళ్లకే పరిమితమయ్యారు.


Tags:    

Similar News