Bird Flu : భారీగా పడిపోయిన చికెన్ అమ్మకాలు .. సండే అయినా?

రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపై పడింది

Update: 2025-02-16 05:59 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ చికెన్ అమ్మకాలపై పడింది. ఏపీలో బర్డ్ ఫ్లూ విస్తరించడంతో కొన్ని జిల్లాల్లోనే అధికారులు అప్రమత్తమయినా రాష్ట్ర వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు తగ్గాయి. ఆదివారం చికెన్ ఎక్కువగా మాంసం ప్రియులు తింటారు. ప్రతి ఆదివారం మాంసం మార్కెట్లు జనంతో రద్దీగా ఉన్నాయి. రేట్లు తగ్గించి అమ్మకాలు జరుపుతున్నా కొనుగోలు చేయడం లేదు.

మటన్, సీఫుడ్ కోసం....
బర్డ్ ఫ్లూ భయంతో మటన్, చేపలు, రొయ్యలు, పీతలకు డిమాండ్ పెరిగింది. బర్డ్ ప్లూ ఎఫెక్ట్ తో కిలో చికెన్ 200 రూపాయాలకు విక్రయిస్తున్నా ఫలితం లేదు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ లేకపోయినప్పటికీ అమ్మకాలపై ప్రభావం మాత్రం కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలోనే 70 శాతం చికెన్ అమ్మకాలు పడిపోయినట్లు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.


Tags:    

Similar News