డేటా చౌర్యం జరిగింది.. బాధ్యులను శిక్షించాల్సిందే

గత ప్రభుత్వ హయాంలో డేటా చౌర్యం జరిగిందని తమ కమిటీ నిర్ధారణకు వచ్చిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.

Update: 2022-09-20 06:46 GMT

గత ప్రభుత్వ హయాంలో డేటా చౌర్యం జరిగిందని తమ కమిటీ నిర్ధారణకు వచ్చిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. అందుకోసమే మధ్యంతర నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెడుతున్నామని ఆయన తెలిపారు. స్పీకర్ నియమించిన హౌస్ కమిటీ అన్ని రకాలుగా విచారించిందన్నారు. మరింత లోతుగా అధ్యయనం చేయాలని కమిటీ నిర్ణయించిందని భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. వ్యక్తుల ప్రయివేటు సమాచారాన్ని గత ప్రభుత్వం దొంగిలించిందని పేర్కొన్నారు. హౌస్ కమిటీ నాలుగు సార్లు అధికారులతో చర్చించామన్నారు. 2017 -19 సంవత్సరాల కాలంలో ప్రయివేటు సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేశారని నిర్ధారణకు వచ్చామని తెలిపారు.

సేవా మిత్ర యాప్ ద్వారా....
సేవా మిత్ర యాప్ ద్వారా తమకు గతంలో ఓటు వేయని 30 లక్షల మంది ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరుగుతుందని తెలిపారు. మధ్యంతర నివేదిక ఆధారంగా పూర్తి స్థాయి విచారణ జరపాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు సేట్ డేటా సెంటర్ల లో ఉండాల్సిన సమాచారం తెలుగుదేశం పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లిందని ఆయన ఆరోపించారు.


Tags:    

Similar News