Bala Krishna : బాలయ్య టీడీపీలో ఒంటరయ్యారా? లెజెండ్ ఫ్యాన్స్ ఫైర్

నందమూరి బాలకృష్ణ కేవలం సినీ హీరో మాత్రమే కాదు. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయుడు

Update: 2025-10-24 09:05 GMT

నందమూరి బాలకృష్ణ కేవలం సినీ హీరో మాత్రమే కాదు. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తనయుడు. హిందూపురం శాసనసభ్యుడు. మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణకు టీడీపీ నేతలు అండగా నిలవడం లేదా? అంటే లేదనే అంటున్నారు. అందులోనూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు. అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పిల్లనిచ్చిన మామ. ఇన్ని ట్యాగులున్న బాలయ్యకు అండగా నిలబడేందుకు టీడీపీలో ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంపై నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. టీడీపీలోనూ అదే చర్చ నడుస్తుంది.

ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో...
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ అప్పట్లో రాజకీయాల్లో కలకలం రేపాయి. జగన్ ను సైకోగాడంటూ.. చిరంజీవిపైన వ్యాఖ్యానించడంతో కూటమి పార్టీల్లోనే ఇబ్బందులు వచ్చే అవకాశముందని భావించి చంద్రబాబు అలెర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఆరోగ్యం బాగాలేక నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ వద్దకు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేత అసెంబ్లీలో తాను చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించి కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అప్పుడు కూడా నందమూరి బాలకృష్ణకు అండగా నిలుస్తూ ఎవరూ మాట్లాడలేదు. ఒక్క సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రమే బాలకృష్ణకు అండగా నిలిచారు.
జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా...
తాజాగా నందమూరి బాలకృష్ణపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి బాలకృష్ణ తాగి వచ్చాడంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు బాలయ్య ఫాన్స్ ను ఆగ్రహానికి గురి చేశాయి. కల్తీ మద్యం పైన, ఇతర విషయాలపై జగన్ మాట్లాడిన వాటికి మాత్రం మంత్రులు, టీడీపీ నేతలు రియాక్ట్ అయ్యారు కానీ, బాలకృష్ణ వ్యవహారంలో మాత్రం ఎవరూ వేలు పెట్టే సాహసం చేయలేదు. నందమూరి బాలకృష్ణపై అంతటి తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తే ఎందుకు టీడీపీ నేతలు అండగా నిలబడలేదన్నది బాలకృష్ణ ఫ్యాన్స్ మాత్రం వర్రీ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ పార్టీ కోసం ఇంత కష్టపడుతున్నప్పటికీ ఆయనను విమర్శించినా ఏ ఒక్కరూ రియాక్ట్ కాకపోవడం వెనక బలమైన కారణం ఉండి ఉంటుందంటున్నారు. చంద్రబాబు, లోకేశ్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Tags:    

Similar News