నాపై హత్యకు కుట్ర : దువ్వాడ శ్రీనివాస్
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ టెక్కలికి వెళుతున్న సందర్భంలో తనపై దాడి చేసి హత్య చేయాలని కుట్రకు తెరలేపారని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు. ఈ ఘటనపై మాధురి, కింజారపు అప్పన్న ల మధ్య జరిగిన ఆడియో బయటకు వచ్చింది.
జాతీయ రహదారిపై...
దీంతో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నిమ్మాడ వద్ద ఆగి తనను చంపడానికి రావాలంటూ జాతీయ రహదారిపై నిలబడి సవాల్ విసిరిన వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని, కావాలంటే బహిష్కరించుకోవాలని కోరారు.ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్ లపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన హత్యకు కుట్ర జరిగిందని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపించారు.