ఏపీ రాజ్ భవన్ లోఎట్ హోం
ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు కూడా ఈ ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన విందుకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా హాజరయ్యారు.
ప్రముఖులు హాజరై...
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకర్టు న్యాయమూర్తులతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు,పార్థసారధి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుతో పాటు చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో పాటు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.