Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలాఖరులోగా అనుమతులు జారీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న వారికి ఇది తీపికబురు లాంటిదే. అనేక దరఖాస్తులు పెండింగ్ లో ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అన్నింటికీ కనెక్షన్లు...
మొత్తం పెండింగ్ దరఖాస్తులు 46,113 ఉన్నాయని అధికారులు తెలిపారు. వీటన్నింటికి విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలంటే వ్యయం 250 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్లు 22.30 లక్షలుండగా, కొత్తగా ఇప్పటికే ఇచ్చిన కనెక్షన్లు 1.12 లక్షలున్నాయని అధికారులు తెలిపారు. పెండింగ్ విద్యుత్తు కనెక్షన్లను క్లియర్ చేయడానికి మరో 10,000 ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమని, విద్యుత్ శాఖ మంత్రి రెండు నెలల్లో పెండింగ్ కనెక్షన్లు పూర్తి చేయాలని డిస్కంలకు ఆదేశించారు. ఈ నిర్ణయంతో సాగు సీజన్‌కు ముందే వేలాది రైతులకు విద్యుత్ సౌకర్యం లభించే అవకాశం ఉంది.