అసెంబ్లీలో మళ్లీ రగడ... దళితుడిగా దూషించారంటూ?

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే తనను కులం పేరుతో దూషించారంటూ మంత్రి మేరుగ నాగార్జునపై టీడీపీ ఆరోపణ చేసింది

Update: 2022-09-15 07:32 GMT

అసెంబ్లీ సమావేశాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే టీడీపీ సభ్యుడు బాలవీరాంజనేయ స్వామి తనను కులం పేరుతో దూషించారంటూ ఫోన్ లో వీడియోను చూపే ప్రయత్నం చేశారు. తనను దూషించనట్లు నిరూపించకపోతే తాను రాజీనామా చేస్తానని అన్నారు. తన పుట్టుక గురించి ఎలా మాట్లాడతారని ఆయన ప్రశ్నించారు. మరొక అంబేద్కర్ వస్తేకాని ఈ శాసనసభలో దళితులకు రక్షణ లేదన్నారు. వెంటనే మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఇందుకు స్పీకర్ అభ్యంతరం తెలిపారు. తనను కులం పేరుతో దూషించారంటూ మంత్రి మేరుగ నాగార్జునపై ఆరోపణ చేశారు. అయితే తాను తప్పుగా ఏం మాట్లాడలేదని మంత్రి మేరుగ నాగార్జున వివరణ ఇచ్చారు.

తాను అనలేదు...
ఎస్సీ కులంలో ఎవరు పుడతారని అనుకుంటారని చంద్రబాబు గతంలో అన్న మాటలను తాను అన్నానని, సభ్యుడిని తాను కించ పర్చలేదని మంత్రి మేరుగ నాగార్జున వివరణ ఇచ్చారు. టీడీపీలో ఉంటూ దళిత ద్రోహిగా బాల వీరాంజనేయస్వామి వ్యవహరిస్తున్నారని నాగార్జున అన్నారు. అయితే దీనిపై మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ మంత్రి మేరుగ నాగార్జున వద్దకు బాల వీరాంజనేయస్వామి వద్దకు వస్తుండగా పయ్యావుల కేశవ్ వెనక్కు తీసుకెళ్లారని, ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని అంబటి రాంబాబు కోరారు. తమ సభ్యులను కావాలని టీడీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొడుతున్నారన్నారు.


Tags:    

Similar News