గోవా వేరీ ప్రోగ్రెసివ్ స్టేట్ : అశోక్ గజపతి రాజు

గోవా గవర్నర్‌గా నియమించడం ఆనందంగా ఉందని అశోక్ గజపతి రాజు అన్నారు

Update: 2025-07-15 02:20 GMT

గోవా గవర్నర్‌గా నియమించడం ఆనందంగా ఉందని అశోక్ గజపతి రాజు అన్నారు. పైడితల్లి అమ్మవారి దీవెనలు అనుకుంటున్నానని తెలిపారు. దేశానికి సేవ చేసే అవకాశం లభించిందని అశోక్ గజపతి రాజు తెలిపారు. తాను గవర్నర్ గా నియమితులవుతానని ఊహించలేదని, కానీ తన పేరు ఖరారు కావడం ఆనందంగా ఉందని అశోక్ గజపతి రాజు తెలిపారు.

బాధ్యతగా నిర్వహిస్తా...
ముఖ్యమంత్రి చంద్రబాబు తన పేరును ప్రతిపాదించడం.. కేంద్రం ఆమోదించడం చాలా సంతోషంగా ఉందని అశోక్ గజపతి రాజు అన్నారు. మోదీ ప్రధాని కాకపోతే, చంద్రబాబు సీఎం కాకపోతే.. తనకు ఈ గవర్నర్ పదవి వచ్చేది కాదన్న ఆయన గోవా వేరీ ప్రోగ్రెసివ్ స్టేట్ అని గవర్నర్ పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు ధన్యవాదాలు తెలిపారు.


Tags:    

Similar News