శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు

కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది

Update: 2022-10-31 05:45 GMT

కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శ్రీశైలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. మల్లన్నను కార్తీక సోమవారం దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. కార్తీక దీపాలను వెలిగించి మహిళలు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.

మొదటి సోమవారం కావడంతో...
స్వామి వారి దర్శనానికి ఆరు గంటలకు పైగానే సమయం పడుతుంది. భక్తుల రద్దీ పెరగడంతో అధికారులు స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. కృష్ణా నదిలో స్నానమాచరించిన భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. కేవలం స్వామి వారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు.


Tags:    

Similar News