YSRCP : అజ్ఞాతంలో శివప్రసాదరెడ్డి

ప్రకాశం జిల్లా పొదిలిలో మహిళలపై జరిగిన దాడి ఘటనలో దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది

Update: 2025-06-14 07:28 GMT

ప్రకాశం జిల్లా పొదిలిలో మహిళలపై జరిగిన దాడి ఘటనలో దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ నెల 11న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించారు. అక్కడ పొగాకు రైతులను పరామర్శించేందుకు జగన్ రావడంతో పెద్దయెత్తున వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చారు.

నోటీసులు ఇవ్వడంతో...
ఈ సందర్భంగా టీడీపీ మహిళ నేతలు కొందరు జగన్ గో బ్యాక్ అంటూ నిరసనకు దిగారు. నల్ల బెలూన్లు, రిబ్బన్లతో వారు నినాదాలు చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. అయితే టీడీపీ కార్యకర్తలు, పోలీసులపై వైసీపీ కార్యకర్తలు, నేతలు రాళ్లు రువ్వారని పోలీసులు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిపై కేసు నమోదు చేయడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో ఆయన పీఏకు నోటీసులు ఇచ్చారు.


Tags:    

Similar News