Andhra Pradesh : సంక్రాంతికి ఆర్టీసీకి కాసుల వర్షం

సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా అదనంగా ఆదాయం లభించింది

Update: 2026-01-19 03:04 GMT

సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా అదనంగా ఆదాయం లభించింది. ఈ ఏడాది అత్యధికంగా సెలవులురావడంతో ప్రయాణాలు కూడా జోరుగా సాగాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీకి సంక్రాంతి పండగ కాసుల వర్షం కురిపించింది. మొత్తం 318 కోట్ల రూపాయలను తెచ్చిపెట్టింది. గత ఏడాది కేవలం 258 కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయాన్ని గడించిన ఏపీఎస్ ఆర్టీసీ, ఈ ఏడాది ఇంకా ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకుంది.

318 కోట్ల రూపాయలు...
మహిళలు ఉచిత ప్రయాణాన్ని కూడా జోరుగా చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ఏపీఎస్ ఆర్టీసీలో లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు రాకపోకలను సాగించారని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ప్రయివేటు బస్సుల్లో ప్రయాణపు ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో పాటు రైళ్లన్నీ ఫుల్లు కావడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది.


Tags:    

Similar News