ఏపీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్

ఏపీఎస్‌ఆర్టీసీ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మంచి ఆఫర్‌ను ప్రకటించింది

Update: 2023-03-30 07:50 GMT

ఏపీఎస్‌ఆర్టీసీ పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. మంచి ఆఫర్‌ను ప్రకటించింది. హాల్ టిక్కెట్ చూపించి ఎక్కిడి నుంచైనా పరీక్ష కేంద్రం వరకూ రాకపోకలు సాగించేందుకు వీలుకల్పించింది. వీరి నుంచి పైసా కూడా వసూలు చేయరు. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు ప్రయాణించవచ్చు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు రవాణా సదుపాయం కల్పిస్తోంది.

ఉచితంగా ప్రయాణం...
ఇందులో భాగంగా పదో తరగతి విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించింది.పదో తరగతి పరీక్షల సందర్భంగా బస్సులు ఎక్కువగా తిప్పాలని ఆర్టీసీ అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఈమేరకు పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంత్రి అధికారులతో సమావేశమయ్యారు. ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 6.15 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది.


Tags:    

Similar News