బుజ్జగింపుల కమిటీ ఏం చేస్తుంది?

బుజ్జగింపుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సిద్దమవతుంది.

Update: 2022-01-23 02:28 GMT

బుజ్జగింపుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు సిద్దమవతుంది. నేటి నుంచి ఉద్యోగుల ఆందోళన ప్రారంభం కావడంతో బుజ్జగింపుల కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించే అవకాశాలున్నాయి. రెండు రోజుల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగ సంఘాలను బుజ్జగించేందుకు సంప్రదింపుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉన్నారు.

నేడు జేఏసీ సమావేశం...
కమిటీ నియామకం జరిగి రెండు రోజులయినా ఇంతవరకూ ఉద్యోగ సంఘాలతో చర్చలకు పిలవలేదు. ఉద్యోగులకు ఆందోళనను ప్రారంభించడంతో ఈరోజు వారిని చర్చలకు ఆహ్వానించే అవకాశముంది. రేపు చర్చలకు రమ్మని పిలుస్తారని తెలుస్తోంది. దీనిపై చర్చించడానికి ఉద్యోగ సంఘాల జేఏసీ స్టీరింగ్ కమిటీ భేటీ కానుంది.


Tags:    

Similar News