ఏపీ కరోనా అప్ డేట్ !

కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా తగ్గినా మాస్కులు వాడటం మానొద్దని ఆరోగ్య నిపుణులు..

Update: 2022-04-23 11:59 GMT

అమరావతి : ఏపీలో కరోనా కట్టడిలో ఉంది. కొద్దిరోజులుగా రాష్ట్రంలో రోజువారి కేసులు ఐదుకు దిగువన నమోదవుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా తగ్గినా మాస్కులు వాడటం మానొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. దాని ప్రకారం నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకూ రాష్ట్రంలో 2,870 శాంపిళ్లను పరీక్షించగా.. ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.

కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ఇదే సమయంలో.. మరో ఇద్దరు కరోనా బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా మరణం సంభవించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14,730గా ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 3,35,14,144 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. 

Tags:    

Similar News