ఏపీలో కొనసాగుతున్న కోవిడ్ ఉద్ధృతి.. భారీగా కేసులు

నాలుగురోజులుగా రాష్ట్రంలో 10 వేల పై చిలుకు కేసులు నమోదవుతుండటం.. ప్రజలతో పాటు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ

Update: 2022-01-21 12:16 GMT

ఏపీలో కొద్దిరోజులుగా కోవిడ్ ఉద్ధృతి విపరీతంగా పెరిగిపోతోంది. నాలుగురోజులుగా రాష్ట్రంలో 10 వేల పై చిలుకు కేసులు నమోదవుతుండటం.. ప్రజలతో పాటు అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేయగా.. గడిచిన 24 గంటల్లో 44,516 శాంపిళ్లను పరీక్షించగా.. 13,212 మందికి పాజిటివ్ గా తేలింది. వీటితో కలిసి ప్రస్తుతం రాష్ట్రంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 64,136కి పెరిగింది.

ఇక ఇదే సమయంలో విశాఖలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 14,532కి పెరిగింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 21,50,373 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 20,71,705 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.


Tags:    

Similar News