ఏపీలో క్రమంగా తగ్గుతోన్న పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న మృతులు

నిన్న విడుదలైన కరోనా బులెటిన్ లో 5,983 కరోనా కేసులు నమోదవ్వగా.. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్

Update: 2022-02-03 11:59 GMT

గత వారమంతా ఏపీపై విరుచుకుపడిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ఈ వారం రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. నిన్న విడుదలైన కరోనా బులెటిన్ లో 5,983 కరోనా కేసులు నమోదవ్వగా.. తాజాగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్ లో ఏపీలో 4,605 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,578 శాంపిల్స్ ను పరీక్షించగా.. 4,605 కొత్తకేసులు బయటపడ్డాయి. ఇదే సమయంలో అనంతపురం, కడప, కర్నూల్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున.. మొత్తం 10 మంది కరోనాతో చనిపోయారు.

ఇక గడిచిన 24 గంటల్లో 11,729 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 22,93,171 కరోనా కేసులు నమోదవ్వగా.. 21,85,042 మంది విముక్తలయ్యారు. ప్రస్తుతం ఏపీలో 93,488 యాక్టివ్ కేసులుండగా.. వారంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. అలాగే రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 14,641కి పెరిగింది.


Tags:    

Similar News