ఏపీలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. 144 సెక్షన్ అమలు !

ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పోలీసులు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. విజయవాడలో నేటిరాత్రి న్యూ ఇయర్ వేడుకలకు

Update: 2021-12-31 05:40 GMT

మరికొద్దిగంటల్లో కొత్త సంవత్సరం ప్రారంభమవ్వనుంది. 2021 కి గుడ్ బై చెప్పి.. 2022కి స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం.. ఇప్పటికే పలు పబ్ లు, క్లబ్ లు రెస్టారెంట్లు తగు ఏర్పాట్లు చేశాయి. అలాగే కోవిడ్ కూడా ఎప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలవుతాయా ? ఎవరిమీద ఎటాక్ చేద్దామా అని ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కోవిడ్ నిబంధనల మధ్యే న్యూ ఇయర్ వేడుకలు జరగనున్నాయి.

బెజవాడలో 144 సెక్షన్
ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో పోలీసులు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించారు. విజయవాడలో నేటిరాత్రి న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి లేదని కమిషనర్ క్రాంతి రాణా స్పష్టం చేశారు. అర్థరాత్రి 12 గంటల వరకు మాత్రమే ఇండోర్ వేడుకలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు. బెజవాడలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, రోడ్లపై ఎవరూ తిరగరాదని క్రాంతి రాణా హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకలను రోడ్లపై చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. అలాగే ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడటంపై నిషేధం విధించినట్లు పేర్కొన్నారు. నగరంలోని క్లబ్ లు, రెస్టారెంట్లలో సైతం 60 శాతం ఆక్యుపెన్సీతోనే వేడుకలు జరుపుకోవాలని.. ఈ మేరకు పోలీసుల నుంచి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని క్రాంతి రాణా స్పష్టం చేశారు.
విశాఖలో 6 నుంచే ఆంక్షలు
అలాగే బెజవాడలో మొత్తం 15 ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నట్లు తెలిపారు. డీజేలు, భారీ స్పీకర్లకు అనుమతి లేదు. ప్రధాన రహదారులైన బందర్​ రోడ్, ఏలూరు రోడ్​, బీఆర్​టీఎస్​రోడ్లలో కఠిన ఆంక్షలు అమలులో ఉంటాయని, బెంజ్ సర్కిల్​ ఫ్లై ఓవర్, కనకదుర్గ ఫ్లై ఓవర్​, పీసీఆర్​ ఫ్లై ఓవర్‌లపై ట్రాఫిక్‌కు అనుమతి లేదని తెలిపారు. మరోవైపు విశాఖలో సాయంత్రం 6 గంటల నుంచే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు నిషేధం విధించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్, బీఆర్టీఎస్ సెంటర్ లైన్ రోడ్ లను మూసివేయనున్నారు. అలాగే బహిరంగంగా కేక్ కటింగ్ లు, డీజే లపై నిషేధం విధించారు.


Tags:    

Similar News