రేపల్లె ఘటనపై మంత్రి సీరియస్.. నిందితులను కఠినంగా శిక్షిస్తాం

రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన చెందారు. సీఎం జగన్ ఈ ఘటనపై చాలా సీరియస్ గా..

Update: 2022-05-01 09:52 GMT

అమరావతి : రేపల్లె బాపట్ల జిల్లా రేపల్లెలోని రైల్వే స్టేషన్లో గత అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలతో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే ఈ ఘటనపై సీఎం జగన్ స్పందించి, బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో మాట్లాడి.. కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అత్యాచార ఘటనపై స్పందించారు.

రేపల్లె రైల్వే స్టేషన్లో మహిళపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని ఆవేదన చెందారు. సీఎం జగన్ ఈ ఘటనపై చాలా సీరియస్ గా ఉన్నారని, నిందితులకు కఠిన శిక్ష విధించేంతవరకూ వదలేదేలేదనిమంత్రి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందుతులను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కాగా.. బాధిత మహిళ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని రేపల్లె ఆస్పత్రి అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి విడదల రజినిపేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలకు తల్లులే కారణమంటూ ఏపీ హోంమంత్రి తానేటి వనిత చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. పిల్లలను ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా చూసుకోవాల్సిన తల్లి.. ఉద్యోగం, కూలి పనులంటూ బయటికి వెళ్తుండటంతో పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారని, అదే అలుసుగా భావించిన ఇరుగుపొరుగు వారు, బంధువులు, పలు సందర్భాల్లో తండ్రులో అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.


Tags:    

Similar News