ఏపీ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ.. ఆ రెండు జీవోలు రద్దు !

ఏపీ సర్కార్ కు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కళాశాలల

Update: 2021-12-27 11:59 GMT

ఏపీ సర్కార్ కు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కళాశాలల ఫీజులను ఖరారు చేస్తూ.. జీవో 53,54లను జారీ చేసింది. ఆ జీవోలను నేడు హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీఓలకు వ్యతిరేకంగా ప్రైవేటు సంస్థల యాజమాన్యం హై కోర్టుని ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది.

ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీల ఫీజులను మీరెలా నిర్ణయిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిబంధనలు, చట్టాలకు వ్యతిరేకంగా జీఓలు ఇచ్చారంటూ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టేసింది. అనంతరం ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. ప్రైవేటు విద్యాసంస్థల అభిప్రాయాలను అనుసరించి.. ప్రభుత్వం ఫీజులను ఖరారు చేయాలని హైకోర్టు తెలిపింది.


Tags:    

Similar News