48 గంటల్లోనే కాఫర్ డ్యాం ఎత్తు పెంపు

వరదలను సమర్థవంతంగా తట్టుకునేందుకు పోలవరం ఎగువ కాఫర్ డ్యాం ఎంత్తును ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది

Update: 2022-07-18 12:57 GMT

గోదావరికి భారీ వరద రావడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరికి భారీ వరదలు వచ్చాయి. వరదలను సమర్థవంతంగా తట్టుకునేందుకు ఎగువ కాఫర్ డ్యాం ఎంత్తును 1.2 మీటరు ఎత్తు పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2.5 కిలోమీటర్ల పొడువున ఉన్న కాఫర్ డ్యామ్ ను ఒక మీటరు ఎత్తు, రెండు మీటర్ల ఎత్తును పెంచేందుకు కాంట్రాక్టర్ మెఘా ఇంజినీరింగ్ సంస్థ నిర్ణయించింది.

వరద నీరు....
కేవలం రెండు రోజుల్లోనే ఎగువ కాఫర్ డ్యాం ఎత్తును మెఘా ఇంజినీరింగ్ సంస్థ పెంచింది. జులై 15 వ తేేదీన పనులను ప్రారంభించి 17వ తేదీ నాటికి పనులు పూర్తి చేసింది. వరద నీరు ఎగువ కాఫర్ డ్యాం పై నుంచి ప్రవహించకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం 12 వేల క్యూబిక్ మీటర్ల రాక్ ఫిల్లింగ్ చేసినట్లు మెఘా ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యాం ఎత్తు 44 మీటర్ల ఎత్తు ఉందని తెలిపింది.


Tags:    

Similar News