గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి
గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 50.3 అడుగులకు చేరింది. ధవళేశ్వరం వద్ద ఇన్,ఔట్ ఫ్లో 9.75 లక్షల క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది. ఈరోజు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
కృష్ణానదిలోనూ...
అలాగే ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదిలోనూ నీటి ప్రవాహం పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్,ఔట్ ఫ్లో 5.04 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక, లంకగ్రామాల లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ కోరింది.