కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.
కృష్ణానదికి వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రజలకు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రకాశం బ్యారేజి వద్ద మూడు లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని తెలిపింది. నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున నదీపరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
వరద ప్రవాహం పెరుగుతుండటంతో...
కృష్ణా నదిలో ఈసమయంలో ఎవరూ ప్రయాణించవద్దని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదని చెప్పింది. జంతువులను నదిలో వదిలేయొద్దని పేర్కొంది. వాగులు, వంకలు కూడా పొంగిపొరలుతున్నాయని, వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని కూడా ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.