Pawan Kalyan : చంద్రబాబు పుట్టిన రోజుకు పవన్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Update: 2025-04-20 04:01 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని తిరిగి సాధారణ స్థితికి చేరుకునేలా చేయడానికి చంద్రబాబు లాంటి దార్శనికుడికి మాత్రమే సాధ్యమవుతుందని పవన్ కల్యాణ్ అన్నారు. శాంతిభద్రతలు క్షీణించిన సమయంలో ఆయన రాకతో ఇప్పుడు గాడిన పడిందన్నారు.

మరిన్ని రోజులు...
పరిపాలన దక్షత కలిగిన చంద్రబాబుకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు బాధ్యతలు మరిన్ని రోజులు నిర్వహించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఆయన నిరంతరం పనిలో చూపే ఉత్సాహం అనితర సాధ్యమని అన్నారు. ఆయన వజ్రోత్సవ జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నందున ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.


Tags:    

Similar News