ఢిల్లీలో జగన్.. నేడు కాన్ఫరెన్స్ లో

వైఎస్ జగన్ నిన్న ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఢిల్లీలో నిర్వహించే సమ్మిట్ కర్టెన్‌రైజర్ మీటింగ్ కు హాజరుకానున్నారు

Update: 2023-01-31 03:04 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఢిల్లీలో నిర్వహించే సమ్మిట్ కర్టెన్‌రైజర్ మీటింగ్ కు హాజరుకానున్నారు. గోబల్ ఇన్విస్టర్ల రౌండ్ టేబుల్ సమావేశంలో విదేశీ దౌత్యవేత్తలు పాల్గొననున్నారు. ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ వేదికగా జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు పదుల సంఖ్యలో విదేశీ దౌత్యవేత్తలు పాల్గొంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

ఏపీలో పెట్టుబడులు...
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే లక్ష్యంతోనే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మార్చి నెలలో విశాఖపట్నంలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు ఎక్కువ మంది పారిశ్రామికవేత్తలు హాజరై ఏపీకి పెద్దయెత్తున పెట్టుబడులు తేవాలన్న లక్ష్యంతోనే ఢిల్లీలో ఈ సమావేశాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఇంత భారీ ఎత్తున పెట్టుబడుల కోసం సమ్మిట్ ను ఏర్పాటు చేసింది.


Tags:    

Similar News