రాజ్యసభ వ్యవహారంపై సినీ నటుడు అలీ.. సీఎం జగన్ ను ఏమన్నారంటే

సినీ నటుడు అలీని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. సీఎం జగన్ కూడా అలీని పిలిపించుకుని మాట్లాడటంతో పెద్దల సభకు ఆయన వెళ్లడం ఖాయమని అందరూ భావించారు.

Update: 2022-05-18 13:51 GMT

సినీ నటుడు అలీని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. సీఎం జగన్ కూడా అలీని పిలిపించుకుని మాట్లాడటంతో పెద్దల సభకు ఆయన వెళ్లడం ఖాయమని అందరూ భావించారు. అయితే వైసీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో అలీ పేరు కనిపించలేదు. విజయసాయిరెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఆర్‌ కృష్ణయ్య, బీద మస్తాన్‌రావులను రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. తొలుత ఈ నలుగురు సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం ఈ నలుగురి పేర్లను అధికారికంగా మంత్రి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

రాజ్యసభ సీటుపై అలీ స్పందించారు. రాజ్యసభ సీటును తాను ఆశించలేదని చెప్పారు. జగన్ దృష్టిలో తాను ఉన్నానని తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా బాధ్యతగా నిర్వర్తిస్తానని అన్నారు. నీకు ఫలానా పదవి ఇస్తానని జగన్ ఏనాడూ చెప్పలేదని... అయితే ఏదో ఒక పదవి ఇస్తానని మాత్రం చెప్పారన్నారు. తనకు కూడా ఆ నమ్మకం ఉందని చెప్పారు. వక్ఫ్ బోర్డు పదవి కూడా తనకు ఇవ్వలేదని... ఇప్పటికే దాన్ని ఇతరులకు కేటాయించారని అన్నారు. నటుడిగా జీవితం ఇచ్చింది ఎస్వీకృష్ణారెడ్డి అని.. రాజకీయంగా నన్ను తీర్చిదిద్దుతోంది జగన్మోహన్ రెడ్డి అని అలీ చెప్పుకొచ్చారు. రాజ్యసభ నేను ఆశించలేదని.. ఎప్పుడు ఏం ఇవ్వాలో సీఎం జగన్ కి బాగా తెలుసునని అలీ చెప్పుకొచ్చారు.

వైసీపీ ఎంపిక చేసిన అభ్య‌ర్థుల జాబితాపై టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌డ‌ప‌లో టీడీపీ నిర్వ‌హించిన బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చంద్ర‌బాబు... ఏపీలో రాజ్య‌స‌భ‌కు అర్హులైన వారే లేరా? అంటూ ప్ర‌శ్నించారు. ఏపీలో రాజ్య‌స‌భ‌లో రాణించే స‌త్తా క‌లిగిన వారు లేనట్టు, నాయ‌కులే లేన‌ట్లు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల నేత‌లు లేన‌ట్లు జ‌గ‌న్ ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారిని ఎంపిక చేశార‌ని విమర్శించారు. త‌న‌ను ప్రశ్నించే వారే లేర‌న్న‌ట్లుగా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News