ఏపీలో 13 కొత్తజిల్లాలు, 22 కొత్త డివిజన్లకు కేబినెట్ ఆమోదం

తాజాగా కొత్త జిల్లాల విషయమై భేటీ అయిన ఏపీ కేబినెట్.. జిల్లాల అవతరణకు ఆమోదం తెలిపింది. సీఎం జగన్ నేతృత్వంలో ..

Update: 2022-03-30 11:39 GMT

అమరావతి : ఏపీలో కొత్త జిల్లాల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. బుధవారం ఉదయం కొత్తజిల్లాల అవతరణకు సీఎం జగన్ ముహూర్తాన్ని ఖరారు చేసిన విషయం తెలిసిందే. తొలుత ఉగాదినాడే కొత్తజిల్లాలను ప్రారంభించాలనుకున్నారు. కానీ.. ఏప్రిల్ 4వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 9.45 గంటల్లోపు సీఎం జగన్ చేతుల మీదుగా కొత్త జిల్లాలు ప్రారంభించాలని నిర్ణయించారు.

తాజాగా కొత్త జిల్లాల విషయమై భేటీ అయిన ఏపీ కేబినెట్.. జిల్లాల అవతరణకు ఆమోదం తెలిపింది. సీఎం జగన్ నేతృత్వంలో సమావేశమైన ఏపీ కేబినెట్ కొత్తగా ఏర్పాటు కానున్న 13 జిల్లాలతో పాటు 22 కొత్త డివిజన్లకూ ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల అవతరణతో ఏపీలో జిల్లాల సంఖ్య 26కి చేరుకోనుండగా.. రెవెన్యూ డివిజన్ల సంఖ్య 70కి చేరనుంది.
ఏపీలో కొత్తగా.. పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా, అల్లూరి జిల్లా, అన‌కాప‌ల్లి జిల్లా, కోన‌సీమ జిల్లా, రాజ‌మండ్రి జిల్లా, న‌ర‌సాపురం జిల్లా, బాప‌ట్ల జిల్లా, న‌ర‌సరావుపేట జిల్లా, తిరుప‌తి, అన్న‌మ‌య్య జిల్లా, నంద్యాల జిల్లా, స‌త్య‌సాయి జిల్లా, ఎన్టీఆర్ విజ‌య‌వాడ జిల్లాలు ఏర్పాటవ్వనున్నాయి.


Tags:    

Similar News