జగన్ పై మరోసారి రఘురామ సంచలన వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-02-13 02:13 GMT

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను టార్చర్ పెట్టని కేసులో నిందితుడిగా ఉన్న కామేపల్లి తులసిబాబును గత ప్రభుత్వం సీఐడీ లీగల్ అసిస్టెంట్ గా నియమించి , నలభై ఎనిమిది లక్షల రూపాయల ఫీజు చెల్లించిందని, హైకోర్టులో 12 సీఐడీ కేసు విచారణ కోసం అతడిని లీగల్ అసిస్టెంట్ గా నియమిస్తున్నట్లు రఘురామ కృష్ణరాజు మీడియాకు తెలిపారు.

ఏసీబీకి లేఖ రాస్తానని...
సీఐడీ క్రిమినల్ కేసుల విషయంలో హైకోర్టులో ట్రయల్ ఉండదని , కానీ నిబంధనలకు విరుద్ధంగా తులసిబాబుకు పదవి అప్పగించారని తెలిపారు. ఈ నియామకం... తులసిబాబుకు అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు మధ్య ఉన్న సంబంధాలకు నిదర్శనమని రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు. తులసిబాబు 2021 అక్టోబరులో బార్ కౌన్సిల్ లో తన పేరు నమోదు చేసుకున్నారని , కానీ , 2020 లోనే అతడిని సీఐడీ లీగల్ అసిస్టెంట్ గా నియమించారని వివరించారు. న్యాయవాదిగా కొనసాగేందుకు అర్హత లేని తులసిబాబును లీగల్ అసిస్టెంట్ గా నియమించి భారీమొత్తంలో ఫీజు చెల్లించడంపై ఏసీబీకి లేఖ రాస్తానని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.


Tags:    

Similar News