చల్లటి కబురు.. మూడురోజులు వర్షాలు

తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ మీదుగా తక్కువ ఎత్తులో

Update: 2023-06-13 09:48 GMT

మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న మూడురోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఒకటిరెండు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. ఈ సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాయలసీమ ప్రాంతంలో మాత్రం వేడి అధికంగా ఉండొచ్చని తెలిపింది.

తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణ మీదుగా తక్కువ ఎత్తులో పశ్చిమం నుంచి వీచే గాలులతో రాష్ట్రంలో ఉక్కపోత తగ్గుతుందని వాతావరణకేంద్ర సంచాలకులు నాగరత్న తెలిపారు.రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పారు. అలాగే రాష్ట్రంలో మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల, కొత్తగూడెం, సూరయాపేట, భూపాలపల్లి జిల్లాల్లో వడగాలులు వీస్తాయని , ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


Tags:    

Similar News