ఏసీబీ దాడుల్లో విస్తుపోయే నిజాలివే

ఆంధ్రప్రదేశ్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

Update: 2025-11-05 11:42 GMT

ఆంధ్రప్రదేశ్ లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఉదయం నుంచి ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతికి అడ్డాలుగా ఈ కార్యాలయాలు మారాయన్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ దాడులు జరుగుతున్న సమయంలో డాక్యుమెంట్లు రైటర్లు, కొందరు ప్రయివేటు సిబ్బంది గోడ దూకి బయటకు పారిపోయారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో...
ఒంగోలులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కిటికీ లోనుంచి డబ్బులు బయటకు విసిరేశారు. దాదాపు ముప్ఫయి వేల రూపాయల నగదును వదిలేశారు. ఒంగోలు, విజయనగరం, శ్రీ సత్యసాయి వంటి జిల్లాల్లో అధికంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రయివేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని దందాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ లు పెరగడంతో పాటు, ఆస్తుల క్రయ విక్రయాలు పెరగడంతో భారీగా మామూళ్లు కూడా వసూలు చేస్తున్నారని ఈ సోదాల ద్వారా తేలింది. సోదాలు రాత్రి వరకూ కొనసాగుతాయని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News