ఏపీలో ఇద్దరు అధికారుల ఇళ్లలో ఏసీబీ దాడులు
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు ఉన్నతాధికారుల ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‍స్పెక్టర్ శైలేంద్ర, కార్మికశాఖ అధికారి బాలూనాయక్ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
కోట్ల విలువైన ఆస్తులు...
ఈ దాడుల్లో కోట్ల విలువైన ఆస్తులు, భారీగా బంగారం, వెండి నగలు, లక్షల్లో నగదు, వాహనాలు సీజ్ చేసినట్లు తెలిసింది. శైలేంద్రను ఒంగోలులో అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు నేడు నెల్లూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. పలు ఆరోపణలతో పాటు అందిన సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.